'యానిమల్' నిర్మాత ఇంట్లో విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి | Animal Producer Krishan Kumar Daughter Passed Away | Sakshi
Sakshi News home page

Krishan Kumar: చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన నిర్మాత కుమార్తె

Jul 19 2024 1:32 PM | Updated on Jul 19 2024 3:15 PM

Animal Producer Krishan Kumar Daughter Passed Away

'యానిమల్' నిర్మాతల్లో ఒకరైనా కృషన్ కుమార్ కుమార్తె కన్నుమూసింది. చాలా చిన్న వయసులోనే అంటే 20 ఏళ్లకే క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించింది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన నిర్మాణ సంస్థ టీ-సిరీస్ కూడా మరణవార్తని ధ్రువీకరించారు.

(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)

బాలీవుడ్‌లోనే బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్. ప్రస్తుతం దీన్ని భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఈయనకు చిన్నాన్న కృషన్ కుమార్. ప్రస్తుతం కృషన్.. టీ-సిరీస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 1995లో 'బేవఫా సనమ్' అనే సినిమాలో నటించిన ఈయన.. ఆ తర్వాత పూర్తిగా నిర్మాణ వ్యవహారాలకే పరిమితమైపోయారు. గతేడాది వచ్చిన 'యానిమల్' నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు.

ఇకపోతే కృషన్ కుమార్‌కి ఒకే ఒక్క కూతురు త్రిష కుమార్. ప్రస్తుతం ఈమెకు 20 ఏళ్లు. కానీ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడిన ఈమెకు జర్మనీలో అత్యాధునిక చికిత్స అందించారు. కానీ వైద్యులు ఈమెని కాపాడలేకపోయారు. జూలై 18న త్రిష తుది శ్వాస విడిచింది. మరీ చిన్న వయసులోనే ఇలా క్యాన్సర్‌తో త్రిష చనిపోవడం బాధాకరమైన విషయం!

(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!)

Advertisement
 
Advertisement
Advertisement