ఓటీటీలోకి 'ఏజెంట్‌' సినిమా.. ట్వీట్‌ చేసిన నిర్మాత | Anil sunkara Comments On Agent OTT Plans | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి 'ఏజెంట్‌' సినిమా.. ట్వీట్‌ చేసిన నిర్మాత

Apr 9 2024 10:39 AM | Updated on Apr 9 2024 1:37 PM

Anil sunkara Comments On Agent OTT Plans - Sakshi

టాలీవుడ్ ​యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్​ రోల్​లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా  యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్‌లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ  ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు.  అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు  ఇదొక  శుభవార్త అనే చెప్పవచ్చు.

ఎప్రిల్‌ 8న అఖిల్‌ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్‌ నిర్మాత అనిల్‌​ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. దీంతో అఖిల్‌ ఫ్యాన్స్‌ రియాక్ట్‌ అయ్యారు. ముందు ఏజెంట్‌ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్‌ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్‌ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విష‌యాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వ‌ర‌లోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని  అనిల్  ట్వీట్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతుంది.

గ‌త ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్‌ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్‌ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్‌లో  మ‌ల‌యాళ టాప్‌ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్‌ సుంకర చేసిన ట్వీట్‌తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement