
వచ్చే నెలలో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే అప్పటివరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss 9 Agnipariksha) మొదలుకానుంది. సామాన్యుల ఎంపిక కోసం ఈ షో డిజైన్ చేశారు. వేలాదిమంది అప్లై చేసుకుంటే బిగ్‌బాస్ టీమ్ వారిని జల్లెడపట్టి 45 మందిని సెలక్ట్ చేశారు. వారి మాట, ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్‌కు ఎవర్ని సెలక్ట్ చేయాలి? ఎవర్ని రిజెక్ట్ చేయాలన్నది బిందు మాధవి, నవదీప్, అభిజిత్ చేతిలో పెట్టారు.
నీకొక్కడికే హృదయం ఉందా?
ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఓ మాస్క్ మ్యాన్ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నీ పేరేంటని జడ్జిలు అడగ్గా.. స్కిన్ నేమ్ మానవ్.. సోల్ నేమ్ హృదయ్ మానవ్ అన్నాడు. హృదయ్ మానవ్ పేరుకు అర్థమేంటన్న ప్రశ్నకు.. హృదయమున్న మానవుడు అని సింపుల్‌గా రిప్లై ఇచ్చాడు మాస్క్ మ్యాన్. అంటే మా అందరికీ హృదయాలు లేవా? అని నవదీప్ అడగ్గా పోనీ, అలాగే అనుకోండి అని ర్యాష్ ఆన్సరిచ్చాడు.

కోపమొస్తే కొట్టేస్తా..
చిన్నప్పటి నుంచి కోపిష్టిని, కోపమొస్తే ఆగను.. కొట్టేస్తా! అనడంతో జడ్జిలు షాక్‌తో నోరెళ్లబెట్టారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఫ్రెండ్‌షిప్ చేసుకోవడానికి కాదన్న మాటకు అభిజిత్ ఏకీభవించలేదు. ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు? అని అడిగితు.. ఫ్రెండ్స్‌కు ట్రోఫీ ఇచ్చేస్తామా? అని మాస్క్ మనిషి సెటైర్ వేశాడు. ఇతడి తీరు నచ్చక అభిజిత్ రెడ్ సిగ్నల్ చూపించాడు. దీంతో అతడు నాకు ఛాన్సివ్వాలని లేకపోతే ఓకే.. కానీ నా క్యారెక్టర్‌ను డిసైడ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.
జడ్జి చేయడానికి దేవుళ్లా?
జడ్జి చేయడానికే ఇక్కడ కూర్చున్నామని నవదీప్ కౌంటరిచ్చాడు. అప్పటికీ అతడు మీరేమైనా దేవుళ్లా అంటూ.. మాట్లాడుతూనే పోయాడు. ఇక బిందు మాధవి.. అతడి మెడలో లూజర్(ఓటమిపాలు) బోర్డు తగిలించింది. ఈ ప్రోమో చూసిన జనాలు.. మాస్క్ మనిషి ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. అని కామెంట్లు చేస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష షో హాట్‌స్టార్‌లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది.
చదవండి: నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి?