Anchor Rashmi Gautam: తన స్థానంలోకి కొత్త యాంకర్‌ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్‌

Anchor Rashmi Gautam Respond On Replace of Sowmya Rao For Comedy Show - Sakshi

తన స్థానంలో సౌమ్య రావు అనే కొత్త యాంకర్‌ను తీసుకురావడంపై రష్మీ గౌతమ్‌ స్పందించింది. కాగా గతంలో జబర్దస్థ్‌కి అనసూయ, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్స్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీగా కారణంగా అనసూయ జబర్దస్త్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చంది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీ యాంకర్‌గా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సడెన్‌గా షో సౌమ్య రావు కనిపించడంతో​ రష్మీని తీసేశారని, ఈ కామెడీ షో నుంచి రష్మీ జౌట్‌ అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి.

చదవండి: బిగ్‌బాస్‌ 6: ఆసక్తిగా గీతూ రాయల్‌ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే!

అంతేకాదు ఈ విషయంలో రష్మీ సీరియస్‌గా ఉందంటూ వదంతులు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై రష్మీ స్పష్టత ఇచ్చింది. ఆమె నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్‌ చిత్రం రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మీకి దీనిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘సౌమ్య రావుపై నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. తను రావడాన్ని స్వాగతిస్తున్నా. ఆమె వస్తుందని మల్లెమాల వారు ముందుగానే నాకు చెప్పారు.

చదవండి: విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్‌’కు గోల్డెన్‌ వీసా

అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతో కొద్ది రోజుల వరకు మాత్రమే నన్ను జబర్దస్త్ షో చేయమని చెప్పారు. ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని ముందుగానే వారు నాకు చెప్పారు. మల్లెమాల సంస్థ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది’ అని చెప్పింది. అయితే ఒకవేళ సౌమ్య వేరే షోస్‌తో బిజీగా ఉండి జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా, క్విట్ చేసినా మళ్ళీ వెళ్తానని, హ్యాపీగా షో చేసుకుంటానని రష్మీ పేర్కొంది. ఈ విషయంలో సౌమ్య యాంకర్ కావడం వల్ల తనకు ఇబ్బందేం లేదని, మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా తాను సిద్ధమేనని రష్మీ చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top