తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్‌ ట్వీట్‌.. మద్దతుగా నిలిచిన అనసూయ! | Anchor Anasuya Support To KTR Tweet Over Telangana Elections | Sakshi
Sakshi News home page

Anasuya: మరోసారి ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు..కేటీఆర్‌కు అనసూయ రిప్లై!

Dec 3 2023 7:52 PM | Updated on Dec 3 2023 8:17 PM

Anchor Anasuya Support To KTR Tweet Over Telangana Elections - Sakshi

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ సాధించడం పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో మేం ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. రెండుసార్లు అధికారాన్ని ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేటీఆర్‌ ట్వీట్‌కు యాంకర్, నటి అనసూయ రిప్లై ఇచ్చింది. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా పోస్ట్ చేసింది. 

అనసూయ తన ట్వీట్‌లో రాస్తూ..' మీరు నిజమైన నాయకుడు సార్. మాలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండొచ్చు.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. మీరు చేసిన అభివృద్ధితో మరోసారి హైదరాబాద్‌పై ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement