లైగర్‌ తర్వాత నాన్నను సలహాలివ్వొద్దన్నా: అనన్య పాండే | Ananya Panday Urges Chunky Panday to Stop Film Advice Post Liger Movie Failure | Sakshi
Sakshi News home page

Ananya Panday: లైగర్‌ తర్వాత ఆయనను జోక్యం చేసుకోవద్దని చెప్పా.. ఏది పడితే అది..

Published Fri, Nov 29 2024 7:00 PM | Last Updated on Fri, Nov 29 2024 7:16 PM

Ananya Panday Urges Chunky Panday to Stop Film Advice Post Liger Movie Failure

వందకోట్లేంటి.. వెయ్యికోట్లు గ్యారెంటీ.. అనుకున్న సినిమాలు కూడా కొన్నిసార్లు బొక్కబోర్లా పడతాయి. అలాంటి కోవలోకే వస్తుంది విజయ్‌ దేవరకొండ 'లైగర్‌' మూవీ. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా చేయమని తన తండ్రి చుంకీ పాండే సలహా ఇచ్చినట్లున్నాడు. ఆ మూవీ బెడిసికొట్టడంతో తనకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వద్దంటోంది అనన్య.

స్క్రిప్ట్‌ సెలక్షన్‌లో జాగ్రత్త..
తాజాగా అనన్య, చుంకీ పాండే 'బి ఎ పేరెంట్‌ యార్‌' అనే షోలో పాల్గొన్నారు. అనన్య మంచి నటి అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ఇంట్లోనా? స్క్రీన్‌పైనా? అని చుంకీ సరదాగా బదులిచ్చాడు. స్క్రిప్టులు సెలక్ట్‌ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని చుంకీ అనగా.. లైగర్‌ సినిమా తర్వాత నువ్వు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని చెప్పానుగా అని అనన్య హెచ్చరించింది.

చదవకుండానే లైక్‌ కొడతాడు
ఇంకా మాట్లాడుతూ.. నాన్న ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాడు. పోస్టులు చదవకుండానే లైక్‌ కొడుతుంటాడు. ఇలాంటివి చేసి ఇబ్బందుల్లో పడే కన్నా ఆయన ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ డిలీట్‌ చేయడమే మేలు అని పేర్కొంది. ఇంతలో చుంకీ కలగజేసుకుంటూ.. నీ ఫోటో ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను లైక్‌ కొడుతున్నానంతే అని చెప్పాడు. 

అది నా అదృష్టం
నెపోటిజం గురించి అనన్య మాట్లాడుతూ.. ఈ రోజుల్లో నెపోటిజం అనేదాన్ని పెద్ద బూతుగా చూస్తున్నారు. ఏదేమైనా ఆయనకు కూతురుగా పుట్టడం నా అదృష్టం. అందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే చుంకీ పాండే ప్రస్తుతం హౌస్‌ఫుల్‌ 5 సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్‌ 6న విడుదల కానుంది. అనన్య.. కంట్రోల్‌ సినిమాతో పాటు కాల్‌ మీ బే వెబ్‌ సిరీస్‌తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement