దసరాకి పొట్టేల్‌ | Ananya Nagalla Pottel Movie Getting Ready For Dussehra Release | Sakshi
Sakshi News home page

దసరాకి పొట్టేల్‌

Aug 16 2024 3:36 AM | Updated on Aug 16 2024 3:36 AM

Ananya Nagalla Pottel Movie Getting Ready For Dussehra Release

దసరాకి థియేటర్స్‌లోకి ‘పొట్టేల్‌’ రానుంది. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పొట్టేల్‌’. నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగె ఈ చిత్రాన్ని నిర్మించారు.

గ్రామీణ నేపథ్యంలో  రూపొందిన ఈ చిత్రాన్ని దసరా పండక్కి రిలీజ్‌ చేయనున్నట్లుగా గురువారం చిత్రయూనిట్‌ వెల్లడించింది. ‘‘పొట్టేల్‌’ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. దీంతో దసరాకు ఈ సినిమా రిలీజ్‌ అనేది అడ్వాంటేజ్‌ అవుతుందని ఆశిస్తున్నాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: మోనిష్‌ భూపతి రాజు.

Advertisement
 
Advertisement
Advertisement