
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సీనియర్ హీరోలలో అమితాబ్ బచ్చన్ ఒకరు. సినిమా అప్‌డేట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా లైవ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంటాడు. వారు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెబుతుంటాడు. తాజాగా ఓ అభిమాని.. అమితాబ్‌ని విమర్శిస్తూ అడిగిన ఓ ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానం చెప్పాడు బిగ్‌బీ.
కొడుకుపై మాత్రమే ప్రశంసలు..!
అమితాబ్‌పై ఓ విమర్శ ఉంది. ఆయన ఎప్పుడూ కొడుకు అభిషేక్ బచ్చన్‌ని పొగుడుతూనే ఉంటాడని.. అదే కోడలు ఐశ్వర్య, భార్య జయా బచ్చన్‌లను ప్రశంసిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయడు. కొడుకుని ప్రశంసినట్లుగానే భార్య, కోడలుని ఎందుకు ప్రశంసించరని కొందరు ఆయనను ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ఇదే ప్రశ్నను డైరెక్ట్‌గా అమితాబ్‌నే అడిగాడు. ఐశ్వర్య, జయా బచ్చన్‌లను ఎందుకు ప్రశంసించరని ప్రశ్నించాడు. దానికి బిగ్‌బీ ఇలా సమాధానం ఇచ్చాడు.
పబ్లిక్‌గా ప్రశంసించను కానీ..
నిజమే.. నేను అభిషేక్‌ని ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యతో పాటు కూతురుని కూడా పొగుడుతుంటాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటుంటాను. అది నాకు మహిళలపై ఉన్న గౌరవం’అని రిప్లై ఇచ్చాడు. మరో యూజర్..‘అమితాబ్ రిప్లై ఇచ్చే వారంతా పెయిడ్ ఫ్యాన్స్’ అని కామెంట్ చేయగా.. దానికి బిగ్‌బీ ఇలా రిప్లై ఇచ్చాడు. ‘పెయిడ్ ఫ్యాన్స్ అని నిరూపించగలవా? నీది చాలా చిన్న మైండ్. అందుకే అలా భావిస్తున్నావు. నువ్వు కూడా డబ్బులు పెట్టి అభిమానులను సంపాదించుకోవచ్చు కదా? అని బిగ్‌బీ కౌంటర్ ఇచ్చాడు.