'నా చావు గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు'.. అమితాబ్‌ ఘాటు రిప్లై! | Amitabh Bachchan responded to a social media user commenting on his age | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: 'నా చావు గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు'.. అమితాబ్‌ ఘాటు రిప్లై!

Jun 10 2025 6:52 PM | Updated on Jun 10 2025 7:43 PM

Amitabh Bachchan responded to a social media user commenting on his age

బిగ్‌బీ అమితాబ్‌కు ఆసక్తికర అనుభవం ఎదురైంది. అమితాబ్ బచ్చన్‌ సోషల్ మీడియాలో నెటిజన్లతో ఓ సెషన్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇచ్చారు బిగ్‌ బీ. మీ గాడ్జెట్స్‌ను బ్రేక్ చేయండి.. మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్‌ పోస్ట్ పెట్టారు.

ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 'మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి..లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరు' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌కు బిగ్‌బీ అమితాబ్‌ తనదైన స్టైల్లోనే నెటిజన్‌కు ఇచ్చిపడేశాడు. నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు.. అంతా ఆ ఈశ్వరుని దయ' అంటూ చేతులెత్తి నమస్కరించే ఎమోజీ జతచేశాడు.

ఆ తర్వాత అమితాబ్‌ ఆరోగ్యం, జీవితం గురించి వరుసగా పోస్టులు పెట్టారు. మన జీవితాన్ని గడపడానికి ఉత్తమ మార్గానికి సంబంధించిన సూత్రాలను అభిమానులు, నెటిజన్లతో  పంచుకున్నారాయన. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీతో అభిమానులను అలలరించాడు. ప్రస్తుతం కల్కి-2లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' నెక్ట్స్‌ సీజన్‌ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement