Amitabh Bachchan Set to Resume Kaun Banega Crorepati, Season 12 | త్వ‌రలోనే కేబీసీ షూటింగ్, బిగ్‌బి - Sakshi
Sakshi News home page

త్వ‌రలోనే కేబీసీ షూటింగ్: బిగ్‌బి

Aug 21 2020 2:56 PM | Updated on Aug 21 2020 4:11 PM

Amitabh Bachchan Gears Up To Resume KBC Shoot - Sakshi

ముంబై : పాపుల‌ర్ టెలివిజ‌న్ గేమ్ షో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి (కేబిసి) అతి త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌సారం కానుంది. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్  త్వ‌ర‌లోనే  కేబీసీ షూటింగ్‌లో పాల్గొన‌డానికి రెడీ అవుతున్నారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న అమితాబ్ కెబీసీ త‌ర్వాతి సీజ‌న్ కోసం అతి త్వ‌ర‌లోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. అత్యంత భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు తీసుకుంటూ షోను తిరిగి ప్రారంభిస్తామ‌ని స్వ‌యంగా అమితాబ్ వెల్ల‌డించారు. ఈ ప‌రిస్థితుల్లో మీరు మ‌ళ్లీ షూటింగ్ చేయ‌డం అవ‌స‌ర‌మా అంటూ వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌పై అమితాబ్ ఘాటుగా స్పందించారు. ‘ఇలాంటివి మాట‌లు మీ ద‌గ్గ‌రే పెట్టుకోండి. స‌మ‌స్య వ‌చ్చింద‌ని అక్క‌డే ఆగిపోతామా?  జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. అన్ని జాగ్రత్త‌ల‌తో 2 రోజుల షెడ్యూల్‌ను ఒక్క‌రోజులోనే పూర్త‌య్యేలా ప్లాన్ చేస్తున్నాం. త్వ‌ర‌లోనే టెలివిజ‌న్‌పై క‌నిపిస్తా’ అంటూ అమితాబ్ పేర్కొన్నారు. (సుశాంత్‌ ఇంటి పనిమనిషిని విచారిస్తున్న సీబీఐ)

జ‌యా బ‌చ్చ‌న్ మిన‌హా అమితాబ్, ఐశ్వ‌ర్యారాయ్, ఆరాధ్య‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కు గ‌త‌నెల‌లోనే క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని లీలావ‌తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొంది పూర్తిగా కోవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇంటికే ప‌రిమిత‌మైన  అమితాబ్ ఆ స‌మ‌యంలోనే కేబీసీ కార్యక్రమం ప్రమోషనల్‌ కాంటెంట్‌ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ద్వారానే ఆయనకు కరోనా వైరస్‌ సోకి ఉంటుందని భావించారు. (అమితాబ్‌, అభిషేక్‌లకు కరోనా)

Advertisement
 
Advertisement
Advertisement