సుశాంత్‌ ఇంటి పనిమనిషిని విచారిస్తున్న సీబీఐ | CBI Probing Sushant House Maid In Mumbai | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ ఇంటి పనిమనిషిని విచారిస్తున్న సీబీఐ

Aug 21 2020 12:08 PM | Updated on Aug 21 2020 2:08 PM

CBI Probing Sushant House Maid In Mumbai - Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రస్తుతం అతని‌ ఇంటి పని మనిషిని విచారిస్తోంది. ఈ మేరకు సీబీఐ అధికారులు బాంద్రా పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీబీఐ అధికారులు.. సుశాంత్‌ ఇంటి పనిమనిషిని కూడా విచారిస్తున్నారు. కాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, రియాతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద రియాను మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. (రియా, మహేష్‌ భట్‌ల వాట్సాప్‌ చాట్‌ వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement