
టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రిత (Suprita) త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానుంది. బిగ్‌బాస్ 7 రన్నరప్ అమర్‌దీప్ చౌదరి (Amardeep Chowdary)తో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆమె యాంకర్ అవతారమెత్తింది. పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా ఈ షోకు నటుడు అమర్‌దీప్, కమెడియన్ వర్ష అతిథులుగా విచ్చేశారు. సముద్రంలో సునామీని, కెమెరా ముందు సుప్రితను ఎవ్వరూ ఆపలేరు అని డైలాగ్ వేసింది. అందుకు అమర్.. 'సునామీలో T సైలెంట్.. ఆవిడ (సుప్రిత) వచ్చిందంటే జనాలు సైలెంట్' అన్నాడు.
అమ్మాయిని కాదనుకుని..
మీరు అమ్మాయా? అబ్బాయా? అని వర్షను ప్రశ్నించింది. అందుకామె.. నేను అమ్మాయిని కాదనుకుని ఒక పార్లర్‌లోనికి పంపించలేదని తెలిపింది. ఎంత డౌట్ వస్తే అలా చేసుంటారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత ఓ సంఘటన జరిగింది కదా.. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అని సురేఖ ప్రశ్నించింది. అందుకు అమర్.. ఆరోజు నేను నా కుటుంబంతో రోడ్డు మీద నిల్చున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో ఆ దారిలో వెళ్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. బ్రో, వి డోంట్ కేర్ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఆ హీరోయిన్‌ను చూశాక నా ఆలోచన మార్చుకున్నా: లక్ష్మీ మంచు