ఓటీటీలో 'అమరన్‌' స్ట్రీమింగ్‌ తేదీని లాక్‌ చేశారా..? | Amaran OTT Streaming Will Be Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'అమరన్‌' స్ట్రీమింగ్‌ తేదీని లాక్‌ చేశారా..?

Published Fri, Nov 29 2024 1:25 PM | Last Updated on Fri, Nov 29 2024 3:02 PM

Amaran OTT Streaming Will Be Streaming Date Locked

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘అమరన్‌’. థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ప్లిక్స్‌ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్టింట ఒక వార్త ట్రెండ్‌ అవుతుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రా​న్ని  కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్‌,క సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే, అమరన్‌ మాత్రం స్ట్రీమింగ్‌కు రాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌ భారీగా ఎదురుచూస్తున్నారు.

భారీ అంచనాల మధ్య అక్టోబర్‌ 31న విడుదలై అమరన్‌ చిత్రాన్ని  శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా  తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు దాటింది అయనప్పటికీ కలెక్షన్స్‌ పరంగా కొన్ని చోట్ల రానిస్తుంది. దీంతో ఓటీటీ విషయంలో ఆలస్యమైంది. అయితే, డిసెంబర్‌ 5న నెట్‌ప్లిక్స్‌లో అమరన్‌  విడుదల కానుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఇదే తేదీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

అమరన్‌ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్‌ చేరింది. శివకార్తికేయన్‌ కెరీర్‌లో టాప్‌ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా అమరన్‌ నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement