అల్లు అర్జున్ కుమారుడు ఎంత క్యూట్‌గా పాడాడో.. | Sakshi
Sakshi News home page

Allu Ayaan: డంకీ మూవీ సాంగ్‌.. అల్లు అయాన్ ఎలా పాడాడో చూడండి..

Published Sat, Feb 24 2024 7:11 PM

Allu Arjun Son Ayaan Singing Shah Rukh Khan Dunki Lutt Putt Gaya Song; Video Viral - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్ల‌లు భ‌లే చ‌లాకీగా ఉంటారు. అల్లు అర్హ త‌న క్యూట్ మాట‌ల‌తో, ఆట‌ల‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. చెల్లితో పోలిస్తే అయాన్ కాస్త సైలెంట్‌గా క‌నిపిస్తాడు. స్నేహ ఉన్న‌ప్పుడు మాత్రం చాలా యాక్టివ్‌గా క‌నిపిస్తాడు. అమ్మ‌కూచి అన్న‌మాట‌! అయితే అయాన్ చిలిపి చేష్ట‌ల‌ను చూసిన నెటిజ‌న్లు అత‌డిని మోడ‌ల్‌గా పిలుస్తూ ఉంటారు.

ఇటీవ‌ల బెర్లిన్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో అల్లు అర్జున్‌కు మీ బుడ్డోడు ఎలా ఉన్నాడ‌న్న ప్ర‌శ్న ఎదురైంది. దీనికి బ‌న్నీ న‌వ్వుతూ 'అయాన్‌.. మోడ‌ల్ బోల్తే..' అంటూ అత‌డి సిగ్నేచ‌ర్‌ను షేర్ చేశాడు. తాజాగా అయాన్ త‌న‌లోని క‌ళ‌ను బ‌య‌ట‌కు తీశాడు. షారుక్ ఖాన్ డంకీ సినిమాలోని లుటు పుటు గ‌యా.. పాట‌ని ఆల‌పించాడు. సీరియ‌స్‌గా కాకుండా స‌ర‌దాగా క్యూట్‌గా పాడాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

చ‌ద‌వండి: విజ‌య‌కాంత్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌.. నేను వ‌ద్ద‌ని తెగేసి చెప్పారు

Advertisement
 
Advertisement
 
Advertisement