నాతో సినిమా చేసేందుకు విజ‌య‌కాంత్ ఒప్పుకోలేదు: ఊర్వ‌శి | Sakshi
Sakshi News home page

Urvashi: విజ‌య‌కాంత్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌.. నేను వ‌ద్ద‌ని తెగేసి చెప్పారు

Published Sat, Feb 24 2024 3:53 PM

Urvashi: Captain Vijayakanth Refused to Act With Me - Sakshi

రాజ‌కీయాల్లో రాణించిన సినిమా స్టార్లు చాలామందే ఉన్నారు. అందులో విజ‌య‌కాంత్ ఒక‌రు. రాజ‌కీయాల్లో క‌రుప్పు ఎంజీఆర్‌గా, సినీరంగంలో కెప్టెన్‌గా క్రేజ్ అందుకున్నాడు విజ‌య‌కాంత్‌. హీరోగా రోజుకు మూడు షిఫ్టులు ప‌ని చేసేవాడు. ఎంత‌లా అంటే 1984లో ఆయ‌న న‌టించిన 18 సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఎంతోమంది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న ఆయ‌న గ‌తేడాది డిసెంబ‌ర్‌లో అనారోగ్యంతో క‌న్నుమూశారు.

న‌న్ను ప్రేమ‌గా పిలిచేవారు
తాజాగా సీనియ‌ర్ న‌టి ఊర్వ‌శి ఆయ‌న్ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. ఆయ‌న త‌న‌తో ప‌ని చేయ‌డానికి నిరాక‌రించారంటూ ఇంట‌ర్వ్యూలో ఆనాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంది. 'నేను చిన్న‌గా ఉన్న‌ప్పుడు విజ‌య‌కాంత్ సినిమాల్లో న‌టించాను. అప్పుడు ఆయ‌న న‌న్ను తంగాచ్చి (చెల్లి) అని పిలిచేవారు. త‌ర్వాత నేను హీరోయిన్‌గానూ సినిమాలు చేశాను.

నాతో సినిమా చేయ‌న‌న్నారు
అలా ఓసారి విజ‌య‌కాంత్ సినిమాలో న‌న్ను హీరోయిన్‌గా అనుకున్నారు. అందుకాయ‌న ఒప్పుకోలేదు. నా ప‌క్క‌న న‌టించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. చెల్లి అని పిలిచాక త‌న‌కు జంట‌గా ఎలా న‌టించ‌గ‌ల‌ను అన్నారు. అంతేకాదు, ఆ మూవీలో హీరోహీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు ఉన్నాయి. అందుకోస‌మే నా ప‌క్క‌న న‌టించ‌లేదు' అని ఊర్వ‌శి చెప్పుకొచ్చింది.

చ‌ద‌వండి: నాని 'గ్యాంగ్‌ లీడర్‌' హీరోయిన్‌ అలాంటి సినిమా చేసిందా.. 20 నిమిషాల సీన్స్‌ కట్‌

Advertisement
 
Advertisement