Updates On Allu Arjun Birthday:బన్నీ ఫ్యాన్స్‌కు హ్యాట్రిక్ సర్‌ప్రైజ్.. ముహూర్తం ఆరోజే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప-2. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. దీంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్-1కు మించి ఉండబోతోందని బన్నీ ఫ‍్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. అందుకే అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారు ఊహించినట్లుగానే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తోంది. కాగాా.. ఇటీవలే వైజాగ్‍లో షూట్ పూర్తి చేసుకున్న బన్నీ తాజాగా ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ వేకేషన్‌లో ఉన్నారు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి చేయాలని మేకర్స్ ప్లాన్. పుష్ప భారీ హిట్ కావడంతో పుష్ప -2 పై అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పుష్ప-2 గ్లింప్స్ కోసం తాము కూడా వెయిట్ చేస్తున్నామని ఆర్ట్ డైరెక్టర్ ఇటివల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దేశముదురు’ రీ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అదే రోజు ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్‌తో బన్నీ ఫ్యాన్స్‌కు హ్యాట్రిక్ సర్‌ప్రైజ్ ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు :