కిరణ్‌ అబ్బవరానికి సారీ చెప్పిన అల్లు అర్జున్‌ | Allu Arjun Apologies to Kiran Abbavaram for KA Movie | Sakshi
Sakshi News home page

Allu Arjun: కిరణ్‌ అబ్బవరంను క్షమించమని అడిగిన బన్నీ.. ఎందుకంటే?

Nov 18 2024 5:08 PM | Updated on Nov 18 2024 5:32 PM

Allu Arjun Apologies to Kiran Abbavaram for KA Movie

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప 2' ట్రైలర్‌ ఆదివారం రిలీజైంది. అలా విడుదల చేశారో లేదో ఇలా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి. ట్రైలర్‌ అదరిఇపోయిందంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే క మూవీతో హిట్‌ అందుకున్న కిరణ్‌ అబ్బవరం సైతం వైల్డ్‌ఫైరూ.. డిసెంబర్‌ 5 కోసం వెయిటింగ్‌ అంటూా ట్వీట్‌ చేశాడు.

తప్పకుండా చూస్తా..
దీనికి బన్నీ స్పందిస్తూ.. థాంక్యూ మై బ్రదర్‌.. అలాగే నువ్వు హిట్‌ అందుకున్నందుకు శుభాకాంక్షలు. బిజీగా ఉండటం వల్ల క సినిమా చూడలేకపోయాను. అందుకు క్షమించు. తప్పకుండా నీ సినిమా చూసి నీకు కాల్‌ చేస్తాను అని రిప్లై ఇచ్చాడు.

బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్‌గా 'క'
ఇకపోతే కిరణ్‌ అబ్బవరం క మూవీ దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న విడుదలైంది. సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్‌ సల్మాన్‌ లక్కీ భాస్కర్‌, శివకార్తికేయన్‌ అమరన్‌ సినిమాలతో పోటీపడిన కిరణ్‌.. బ్లాక్‌బస్టర్‌ హిట్టు అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement