అల్లు అర్హ బర్త్‌ డే.. ముద్దుల కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్! | allu arjun and sneha reddy special wishes To her Baby Allu Arha Birthday | Sakshi
Sakshi News home page

Allu Arha Birthday: అల్లు అర్హ బర్త్‌ డే.. ముద్దుల కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!

Nov 21 2024 1:55 PM | Updated on Nov 21 2024 2:51 PM

allu arjun and sneha reddy special wishes To her Baby Allu Arha Birthday

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌, ఆయన సతీమణి స్నేహరెడ్డి గారాలపట్టి ‍అల్లు అర్హ ఇటీవల రియాలిటీ షోలో కనిపించింది. తండ్రితో కలిసి పాల్గొన్న అర్హ అచ్చ తెలుగులో పద్యం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇవాళ బన్నీ ముద్దుల కూతురు అర్హ తన ఎనిమిదో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఫ్యాన్స్‌ అభిమాన హీరో కూతురికి బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు.

అయితే అల్లు అర్జున్ తన కూతురి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 8 సంవత్సరాల స్వచ్ఛమైన ఆనందం.. నా లిటిల్ అర్హ నా జీవితాన్ని మధురంగా ​​మార్చింది.. నీపై అనంతమైన ప్రేమతో మీ నాన్న అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు స్నేహరెడ్డి తన గారాలపట్టికి బర్త్‌ డే విషెస్ తెలిపింది. అర్హకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటెస్ట్, స్వీటెస్ట్ బేబీ..మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం అర్హ' అంటూ పోస్ట్ చేసింది. మా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన రోజు అంటూ తమ ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement