
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt ) మాజీ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) వేదికా ప్రకాశ్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ సోనీ రజ్దాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాశ్‌శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2021 నుంచి 2024 వరకు అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్‌లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదికా నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్నీ మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఐదు నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్తాన్, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.