అలా.. హిట్‌ కావాలి | Ala Ela Ela MOvie Audio, Trailer Launched | Sakshi
Sakshi News home page

సందడిగా ‘అలా ఇలా ఎలా’ ఆడియో ఫంక్షన్‌

Jun 27 2023 1:18 PM | Updated on Jun 27 2023 1:18 PM

Ala Ela Ela MOvie Audio, Trailer Launched - Sakshi

ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ‘అలా ఇలా ఎలా’.  రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ హిందూపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ ఆడియో ఫంక్షన్‌కి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్, పాటలను విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ  ‘ఆలా ఇలా ఎలా’ చిత్రం ట్రైలర్ ను ఇప్పుడు చూసాం, చాలా బాగుంది, ఇలాంటి వేడుక హిందూపూర్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి’ అని కోరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారు మాట్లాడుతూ  ‘ఆలా ఇలా ఎలా’ ట్రైలర్ చాలా బాగుంది, నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి నా శుభాకాంక్షలు. రాజకీయాల్లో మేము ఎంత విజయం సాధించామో నిర్మాత నాగరాజు గారు కూడా ఈ చిత్రం తో సినీరంగం లో కూడా అంతటి విజయం సాదించాలి’ అని కోరుకున్నారు.

హీరో శక్తి వాసుదేవన్ మాట్లాడుతూ  ‘ఈ చిత్రం కోసం 83 రోజులు  శ్రమించాం. మా డైరెక్టర్‌ రాఘవ ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా చాలా బాగుంటుంది.అందరికి నచ్చుతుంది’అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement