Nagarjuna Shocking Remuneration For Bigg Boss 6 Telugu, Details Inside - Sakshi
Sakshi News home page

Nagarjuna BB6 Remuneration: బిగ్‌బాస్‌ ఒక్క ఎపిసోడ్‌కు నాగార్జున రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌

Aug 11 2022 10:11 AM | Updated on Sep 1 2022 1:59 PM

Akkineni Nagarjuna Remuneration For Bigg Boss Telugu Season 6 - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే ఐదు సీజన్లు కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో త్వరలోనే సీజన్‌-6తో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌4 నుంచి ఈ షో ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరి పేర్లు బయటికొచ్చాయి.

సోషల్‌ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. . దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్‌, ఆర్జే సూర్య, యాంకర్‌ ఉదయభాను, అమర్‌దీప్‌, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్‌.. షోలో అడుగు పెట్టబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక గత మూడు మూడు సీజన్స్‌(3,4,5)తో పాటు బిగ్‌బాస్‌ ఓటీటీకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున..ఆరో సీజన్‌కి కూడా హోస్టింగ్‌ చేయబోతున్నారు.

ఈ క్రమంలో బిగ్‌బాస్‌ సీజన్‌-6కి నాగార్జున తీసుకునే రెమ్యుననరేషన్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గత సీజన్‌ కోసం ఒక్క ఎపిసోడ్‌కు రూ. 12 లక్షల రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు సమాచారం. షో మొత్తానికి కలిపి  రూ. 12కోట్లు తీసుకున్నాడని, ఇప్పుడు సీజన్‌-6 కోసం ఏకంగా రూ. 14 నుంచి 15 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement