తండేల్ సూపర్ హిట్ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya).. డైరెక్టర్ కార్తీక్ దండుతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చైతూ కెరీర్‌లో 24వ మూవీ కాగా.. ప్రస్తుతం ఎన్‌సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గాల కనిపించనుంది.
అయితే ఇవాళ చైతూ బర్త్ డే కావడంతో మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. చైతూ మూవీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు వృషకర్మ(VrushaKarma) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు నాగచైతన్య పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. ఈ పోస్టర్ చైతూ ఫ్యాన్స్‌న విపరీతంగా ఆకట్టుకుంటోంది.
#VRUSHAKARMA it is for #Nc24 .@karthikdandu86 has something special coming your way for sure !
@Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings @Vrushakarma @Tseries @TseriesSouth pic.twitter.com/fwZbl0qxtO— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2025


