Akhanda: Director Boyapati Srinu Shocking Remuneration For Next Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Boyapati Srinu: హీరో కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న 'అఖండ' దర్శకుడు

Feb 8 2022 11:27 AM | Updated on Feb 8 2022 12:23 PM

Akhanda Director Boyapati Srinu Shocking Remuneration For Next Movie - Sakshi

బాలయ్య బిజీ షెడ్యూల్‌లో ఉండటంతో ప్రస్తుతం వేరే సినిమాను పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడు. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేనితో మాస్‌ మూవీ చేసేందుకు మంచి కథ సిద్ధం చేసుకున్నాడట ఈ డైరెక్టర్‌. అయితే ఇక్కడ ట్విస్టేంటంటే..

తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్లు అందించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవలే నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ' ద్వారా మరో సూపర్‌ డూపర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడీ డైరెక్టర్‌. 50 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్స్‌ సాధించి రికార్డులను తిరగరాసిందీ మూవీ. ఓటీటీలో కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'అఖండ' సినిమాతో బోయపాటి రేంజ్‌ పెరిగింది. దీంతో హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడట!

అఖండ సీక్వెల్‌ తీసేందుకు బోయపాటి సిద్ధంగా ఉన్నాడు. కానీ బాలయ్య బిజీ షెడ్యూల్‌లో ఉండటంతో ప్రస్తుతం వేరే సినిమాను పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడు. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేనితో మాస్‌ మూవీ చేసేందుకు మంచి కథ సిద్ధం చేసుకున్నాడట ఈ డైరెక్టర్‌. ఇక్కడ ట్విస్టేంటంటే.. హీరో రామ్‌ కన్నా దర్శకుడు బోయపాటి శ్రీను ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్‌ హీరో రామ్‌ 9 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంటే అఖండ డైరెక్టర్‌ బోయపాటి దానికి మరో మూడు కోట్లు జత చేసి మొత్తంగా రూ. 12 కోట్లు అందుకోనున్నాడట. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement