
కోలీవుడ్‌లో నటుడు అజిత్ రూటే సపరేట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన లోకమే వేరు. అజిత్ ది చాలా క్రియేటివ్ మైండ్. మొదటి నుంచి నటనపై దష్టి సారించి అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆ మధ్య ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం విద్యార్థులకు హెలీకాప్టర్ టెస్ట్ పైలెట్ గానూ,ఎడ్వైజర్ గానూ వ్యవహరించారు. ఆ తరువాత గన్ షూటింగ్ పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత బైక్ రేసుల్లోనూ పాల్గొన్నారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయి కారు రేసుల్లోను పొల్గొంటూ పతకాలను సాధిస్తున్నారు.
అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో సొంతంగా పందెం పోటీలు సంస్థను ప్రారంభించారు. అలా తన రేస్ టీమ్‌తో ఇప్పటికే దుబాయి, బెల్జియం వంటి దేశాల్లో కార్ రేస్సుల్లో పోటీ చేసి తృతీయ స్థాయి పతకాలను గెలిచారు. తాజాగా శని, ఆదివారాల్లో స్పెయిన్‌లో జరిగిన కార్ రేస్సుల్లో పాల్గొని మరోసారి కాంస్య పతాకాన్ని గెలిచారు. కాగా ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో త్వరలో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది అజిత్ నటించే 64వ చిత్రం అవుతుంది.
ఈ సందర్భంగా అజిత్ ఒక భేటీలో పేర్కొంటూ తన తదుపరి కార్ రేస్ పోటిలో ఇండియన్ సినిమాను ప్రమోట్ చేయనున్నారని తెలిపారు. అలా తన కారుపై ఇండియా సినిమా లోగో ను పొందుపరచనున్నట్లు చెప్పారు. తన భార్య శాలిని గురించి పేర్కొంటూ ఆమె ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తోందని చెప్పారు. ఆమె సహకారం లేకపోతే ఇదంతా చేయడం తన వల్ల అయ్యేది కాదన్నారు. తాను లేనప్పుడు ఇల్లు, పిల్లల బాధ్యతలు తానే చూసుకుంటోందని చెప్పారు. తాను పిల్లల్లి చూడడం కూడా అరుదైపోయిందన్నారు. మీరు ఇష్టమైనది చేయాలనుకుంటే కొన్ని సమయాల్లో కొన్ని త్యాగం చేయక తప్పదన్నారు.
తాను కొడుకు ఆద్విక్ కూడా బైక్ రేసీలంటే ఇష్టమే నన్నారు. తన గో కార్డింగ్ ప్రారంభించారని, అయితే అందులో ఇంకా పూర్తి శ్రద్ధ పెట్టలేదని పేర్కొన్నారు. సినిమా అయినా, రేసులు అయినా తన భావాలను పిల్లలపై బలవంతంగా రుద్దనన్నారు. వారు ఏం చేయాలనుకుంటారో అందుకు తన మద్దతు ఉంటుందని అజిత్ స్పష్టం చేశారు.