అజయ్‌ దేవ‌గన్‌‌ సోదరుడు మృతి

Ajay Devgn Cousin Anil Devgan Passes Away At 51 In Mumbai - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ‌గన్‌‌ సోదరుడు అనిల్‌ దేవగన్‌‌(51) కన్నుమూశారు. గుండెపోటుతో సోమవారం రాత్రి ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అజయ్‌ దేవగన్‌‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అనిల్‌ ఫోటోను ట్విటర్లో పోస్ట్‌ చేస్తూ.. గత రాత్రి నా సోదరుడు అనిల్‌ దేవగన్‌‌ మరణించాడు. అతని అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచి వేసింది. అతనిని ఎంతో కోల్పోతాను. అనిల్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కోవిడ్‌ కారణంగా ఎలాంటి వ్యక్తిగత ప్రార్థన సమావేశం ఉండదు. అని ట్వీట్‌ చేశారు. చదవండి అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్

అనిల్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనిల్‌ ఆ తరువాత రాజు చాచా, బ్లాక్‌మెయిల్‌, హాల్‌-ఈ-దిల్‌ వంటి సినిమాలను తెరకెక్కించారు. దర్శకత్వంతో పాటు అజయ్ దేవగన్‌ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా అనిల్ దేవగన్‌ పనిచేశారు. అదే విధంగా గత ఏడాది (2019 మే 27) అజయ్ దేవగన్‌ తండ్రి వీరూ దేవగన్‌ కూ డా మరణించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top