వారి నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది | Aishwarya Rajesh Talks About Farhana Movie Press Meet | Sakshi
Sakshi News home page

వారి నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది

May 9 2023 4:02 AM | Updated on May 9 2023 4:02 AM

Aishwarya Rajesh Talks About Farhana Movie Press Meet - Sakshi

ఎస్‌ఆర్‌ ప్రభు, ఐశ్వర్యా రాజేష్, నెల్సన్, ఐశ్వర్యా దత్తా

‘‘ఫర్హానా’ నాకు స్పెషల్‌ మూవీ. నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్‌లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఓ లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ మూడు భాషల్లో విడుదల కావడం పెద్ద విషయం. డైరెక్టర్, నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది’’ అన్నారు æ ఐశ్వర్యా రాజేష్‌. నెల్సన్  వెంకటేశన్  దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్‌  ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫర్హానా’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ–‘‘సినిమాని సెలబ్రేట్‌ చేసే ఇండస్ట్రీ టాలీవుడ్‌. ఇక్కడ మంచి కంటెంట్‌ని సెలబ్రేట్‌ చేస్తారు. ఆ నమ్మకంతో ‘ఫర్హానా’ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం’’అన్నారు. ‘‘ఫర్హానా’ నా మూడో చిత్రం. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది పక్కా తెలుగు సినిమాలా ఉంటుంది’’ అన్నారు నెల్సన్‌ వెంకటేశన్‌. ‘‘గత ఏడాది మేం రిలీజ్‌ చేసిన ‘ఒకే ఒక జీవితం’ని ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ‘ఫర్హానా’తో వస్తున్నాం’’ అన్నారు నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు. ‘‘ఫర్హానా’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకర్, నటి ఐశ్వర్యా దత్తా.
 

Advertisement
 
Advertisement
Advertisement