breaking news
farhana
-
ఫర్హానా సినిమాపై విమర్శలు.. స్పందించిన చిత్రయూనిట్
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఫర్హానా. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. అయితే ఫర్హానా చిత్రం ఒక మతాన్ని అవమానించే విధంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాతలు గురువారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తమ సంస్థ నుంచి ఇంతకు ముందు పలు ప్రజాదరణ పొందిన కథా చిత్రాలు వచ్చాయన్నారు. వివాదాస్పద కథా చిత్రాలను నిర్మించడం తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచనే తమకు లేదన్నారు. ఫర్హానా అందరూ చూడాల్సిన మంచి కథా చిత్రం అన్నారు. సెన్నార్ బోర్డు ధ్రువపత్రాన్ని పొంది విడుదల చేస్తున్న చిత్రమని పేర్కొన్నారు. అలాంటి చిత్రం గురించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూడకుండానే దీన్ని వివాదంగా మార్చడం సమంజసం కాదన్నారు. మతసామరస్యానికి చిహ్నం మన తమిళనాడు అని, ఫర్హానా ఏ మతాన్ని కించపరచదని తెలిపారు. మతసామరస్యానికి భంగం కలిగించే ఎలాంటి చిత్రాలను తాము నిర్మించమని పేర్కొన్నారు. చదవండి: కస్టడీ నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తీసిన సినిమా: నాగచైతన్య -
వారి నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది
‘‘ఫర్హానా’ నాకు స్పెషల్ మూవీ. నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ మూడు భాషల్లో విడుదల కావడం పెద్ద విషయం. డైరెక్టర్, నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది’’ అన్నారు æ ఐశ్వర్యా రాజేష్. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫర్హానా’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ–‘‘సినిమాని సెలబ్రేట్ చేసే ఇండస్ట్రీ టాలీవుడ్. ఇక్కడ మంచి కంటెంట్‌ని సెలబ్రేట్ చేస్తారు. ఆ నమ్మకంతో ‘ఫర్హానా’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం’’అన్నారు. ‘‘ఫర్హానా’ నా మూడో చిత్రం. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది పక్కా తెలుగు సినిమాలా ఉంటుంది’’ అన్నారు నెల్సన్ వెంకటేశన్. ‘‘గత ఏడాది మేం రిలీజ్ చేసిన ‘ఒకే ఒక జీవితం’ని ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ‘ఫర్హానా’తో వస్తున్నాం’’ అన్నారు నిర్మాత ఎస్ఆర్ ప్రభు. ‘‘ఫర్హానా’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్, నటి ఐశ్వర్యా దత్తా. -
నరరూప రాక్షసుడు నయీం !
-
దండోపాయంతో ‘దారి’లోకి..
-
దండోపాయంతో ‘దారి’లోకి..
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మహిళా అనుచరులుగా చెలామణి అయిన ఫర్హానా, అఫ్షాలు కూడా మొదట్లో అతడి బాధితులే అని తేలింది. నయీమ్ బంధువులైన వీరిద్దరు అల్కాపురి టౌన్‌షిప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఇంట్లో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నార్సింగ్ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. తొలినాళ్లలో నయీమ్ క్రూరత్వాన్ని చవిచూసిన వీరు.. ఆ తర్వాతే అతడి వెంట ఉంటూ నేరాల్లో పాలుపంచుకోవడం, ఆస్తులకు బినామీగా మారడం చేశారు. మరోవైపు నయీమ్ రాష్ట్ర సరిహ ద్దులు దాటి ప్రయాణించేప్పుడు తన ఆయుధాలను మహిళల వద్ద ఉంచేవాడని తేలింది. వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అధీనంలోకి తీసుకొని బినామీగా.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలన్‌కు చెందిన ఫర్హానాకు 1999లో మిర్యాలగూడకు చెందిన సయ్యద్ అహ్మద్‌తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేసే వాడు. 2007లో భర్త చనిపోవడంతో 2009 వరకు అత్తగారింట్లోనే ఉంది. వరుసకు అన్న అయిన నయీమ్ ఇంట్లో పిల్లల్ని చూసుకునే పని చేయాల్సిందిగా అత్త చెప్పడంతో ఫర్హానా అంగీకరించింది. తన మూడో కుమారుడైన సలీమ్‌ను తీసుకుని నయీమ్ వద్దకు వచ్చింది. అప్పట్లో నయీమ్ హయత్‌నగర్‌లో ‘రంగన్న’ అనే పేరుతో ఉన్న ఇంట్లో నివసించేవాడు. ఆ ఇంట్లో యువతులపై జరిగే ఘోరాలను ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ ఫర్హానాను బెదిరించాడు. సలీమ్‌ను కూడా తీవ్రంగా హింసించడంతో అతడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. వావి వరసలు మర్చిపోయిన నయీమ్... ఫర్హానాతోనూ వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఓ దశలో ఆమె పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చిందని నమ్మిన తర్వాత తన ఆస్తులకూ బినామీగా మార్చుకున్నాడు. అల్కాపురి టౌన్ షిప్‌లోని నయీమ్‌కు మూడంతస్తుల ఇల్లు ఉంది. మూడో అంతస్తులో జిమ్ ఉండగా రెండో అంతస్తులో నయీమ్ తన భార్య పిల్లలతో ఉండేవాడు. మొదటి అంతస్తులో ఫర్హానాతోపాటు యువతులు, మైనర్లు, గ్రౌండ్ ఫ్లోర్లో డ్రైవర్ కేసీఆర్ అలియాస్ కిషోర్ నివసించే వాడు. నయీమ్ తమపై చేస్తున్న అఘాయిత్యాలను మైనర్లు అప్పుడప్పుడు ఫర్హానాతో చెప్పేవారు. వారిని ఆమె ఓదార్చుతున్న విషయం తెల్సుకున్న నయీమ్.. శిక్షగా ఆమెకు గుండు గీయించాడు. ఫర్హానాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత నేరాల్లోనూ ఆమెను వాడాడు. సొంత బావ నదీంను చంపిన తర్వాత మృతదేహాన్ని కొత్తూర్ తీసుకు వెళ్లి కాల్చేయడానికీ ఫర్హానాను వెంట తీసుకెళ్లాడు. పని ఇప్పిస్తానంటూ.. అఫ్షాను.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని ఈదులగూడెంకు చెందిన అఫ్షా వరుసకు నయీమ్ మేనకోడలు. ఈమె తండ్రికి భువనగిరిలో కేబుల్ నెట్వర్క్ ఉండేది. భువనగిరిలో పదో తరగతి వరకు చదివిన అఫ్షా చదువు అక్కడితో ఆపించి, తన వద్దకు పంపమంటూ నయీమ్ ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో చదువు మాన్పిం చిన అఫ్షా తల్లిదండ్రులు 2010లో మిర్యాలగూడకు చెందిన అమీర్‌కు ఇచ్చి ఆమె వివాహం చేశారు. డిగ్రీ పూర్తి చేసిన అమీర్ ఖాళీగానే ఉండటంతో అతడి తండ్రే కుటుంబ పోషణ చూసేవారు. ఏడాది తర్వాత వీరికి పాప పుట్టింది. ఓ సందర్భంలో బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా నయీమ్ కూడా అక్కడకు వచ్చాడు. అఫ్షా, ఆమె భర్తను చూసిన నయీమ్ హైదరాబాద్ వస్తే పని ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వారు పాపతో సహా అప్పట్లో నయీమ్ ఇంటికి వచ్చారు. కొన్ని రోజులకు అమీర్ ప్రైవేట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. బావ నదీంను హత్య చేయడానికి నిర్ణయించుకున్న రోజే అఫ్షాను నయీమ్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆమె జీవితం నయీమ్ చేతిలో చిక్కింది. కొన్ని నేరాల్లోనూ పాలుపంచుకుంది. వారంతా ఎక్కడున్నారు? అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంటికి మారడానికి ముందు నయీమ్ షాద్‌నగర్‌లో ఓ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఏడాది పాటు తన తమ్ముడి భార్య హీనా, కుమార్తె చియాన్లను తీవ్రంగా హింసించగా వీరిద్దరూ సైతం కనిపించకుండా పోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే నయీమ్ మిర్యాలగూడ నుంచి సాదియా, మాలియా, జోహా పేర్లతో ఉన్న యువతులను చదివిస్తానంటూ తీసుకువచ్చాడు. ఆ ముగ్గురిపైనా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించేవాడు. వీరితో పాటు నయీమ్ తమ్ముడి కుమార్తె షమ, బంధువు అషు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలియట్లేదు. అలాగే రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో తన వెంట ఉండే శమ అలియాష్ అహేలా, సదా అలియాస్ నీలోఫర్, కరీన అలియాస్ అఫ్సలను తీసుకెళ్లేవాడు. వారికి జీన్‌ప్యాంట్స్ వేసి నడుముకు ఆయుధాలు ఉంచేవాడు. ఆపై బుర్ఖా వేయించి తనతో పాటే తీసుకువెళ్లేవాడు. వీరు ఎవరు? ఎక్కడున్నారన్న అంశాలపై పోలీసు విభాగం దృష్టిపెట్టింది. -
ఫర్హానా, అఫ్షాలకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటి వంటమనిషి ఫర్హానా, నయీం డ్రైవర్ భార్య అఫ్షాలకు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఘర్హానా నిందితురాలు. దాంతో ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు నిందితుల కస్టడీ పిటిషిన్ దాఖలు చేశారు. నయీమ్ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్షాలు డెన్ కీపర్లుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. నయీం డెన్ నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాగా, నయీం అంత్యక్రియలు నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ రోజు జరుగనున్నట్టు తెలుస్తోంది. -
పెళ్లైన రెండు నెలలకే..
కడప అర్బన్: కడప పట్టణంలోని మట్టిపెద్ద పులివీధిలో ఇద్దరు భార్యాభర్తలు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పఠాన్ ఖాజా నవాజ్ ఖాన్(30), ఫర్హానా(25)లకు రెండు నెలలు క్రితమే వివాహం జరిగింది. మనస్పర్ధలతో నవాజ్, ఫర్హానాకు ఉరివేసి తనుకూడా ఉరి వేసుకున్నట్లు తెలిసింది. దంపతులు శనివారం ఇంట్లో ఒకే చీరకు ఉరి వేసుకుని కనపడ్డారు. సీఐ సదాశివయ్య, ఎస్ఐ రోషన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.