ప్రాజెక్ట్‌ లాక్‌ | Adah Sharma signs a Telugu film | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్‌ లాక్‌

Jul 27 2020 3:42 AM | Updated on Jul 27 2020 3:53 AM

Adah Sharma signs a Telugu film - Sakshi

అదా శర్మ

లాక్‌ డౌన్‌ లో కొత్త ప్రాజెక్ట్‌ లను లాక్‌ చేస్తున్నారు స్టార్స్‌. తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్‌ అంగీకరించినట్టు ప్రకటించారు అదా శర్మ. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గించారు అదా. 2016లో ‘క్షణం’, గత ఏడాది ‘కల్కి’ తర్వాత అదా చేయబోతున్న తెలుగు సినిమా ఇదే. తెలుగులో వరుస సినిమాలు చేయకపోయినా హిందీ సినిమాల్లో కనిపిస్తున్నారు. ‘బై పాస్‌ రోడ్, కమాండో 3’ వంటి  హిందీ సినిమాల్లో గత ఏడాది కనిపించారు అదా. అలాగే రెండు వెబ్‌ సిరీస్‌ ల్లోనూ నటించారామె. తెలుగులో అంగీకరించిన తాజా చిత్రం గురించి అదా మాట్లాడుతూ –  ‘కొత్త సినిమా సైన్‌ చేశాను. చాలా ఎగ్జయిటింగ్‌ ఉంది. ఇందులో మంచి పాత్రను పోషిస్తున్నాను’’ అన్నారు అదా శర్మ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement