
యాంకర్, బుల్లితెర నటి సమీరా షెరిఫ్ (Sameera Sherief) గుడ్‌న్యూస్ చెప్పింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సమీరా- సయ్యద్ అన్వర్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్నాం అని రాసుకొచ్చారు. అలాగే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు.. సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సమీరా ప్రెగ్నెన్సీ జర్నీ..
సమీరా 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాదే నటి తొలిసారి గర్భం దాల్చింది. అప్పుడు ఆమె తమిళంలో మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తోంది. షూటింగ్ అవగానే హాస్పిటల్‌కు వెళ్దామనుకుంది. అంతలోనే తీవ్ర రక్తస్రావమై కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. తర్వాత 2021లో మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అలా ఆమెకు అర్హాన్ జన్మించాడు. 2023లో మరోసారి ప్రెగ్నెంట్ కావడంతో ఇంటిల్లిపాది ఎంతో సంతోషించారు. కానీ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో గర్భం నుంచి శిశువును తీసేశారు. 2024 చివర్లో మరోసారి ప్రెగ్నెంట్ అని తేలగా.. ఇప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది.
సమీరా ఎందుకింత పాపులర్?
ఆడపిల్ల సీరియల్‌తో సమీరా ఒక్కసారిగా పాపులర్ అయింది. అభిషేకం, భార్యామణి, ముద్దుబిడ్డ.. ఇలా ఎన్నో ధారావాహికలు చేసింది. అదిరింది షోకి కొన్నిరోజులపాటు యాంకర్‌గానూ వ్యవహరించింది.
చదవండి: జెన్ Z అంటే ఇదేనా? ఆశిష్‌ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం