Actress Rakul Preet Singh Fire on Comparison of South and Bollywood - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: ప్రతిదీ భూతద్దంలో చూస్తున్నారు.. రకుల్ కామెంట్స్ వైరల్

Feb 28 2023 8:14 PM | Updated on Feb 28 2023 9:26 PM

Actress Rakul Preet Singh Fire On Comparision Of South and Bollywood - Sakshi

తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి, 'థ్యాంక్ గాడ్', కట్‌ పుట్లి, రన్‌వే 34, అటాక్  విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. ప్రస్తుతం కమల్ హాసన్ మూవీ ఇండియన్- 2లో కనిపించనుంది. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. గత కొద్ది రోజులుగా సౌత్ వర్సెస్ బాలీవుడ్ అంటూ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటుడు సౌత్ సినిమాల్లో లాజిక్ ఉండదంటూ ఘాటు కామెంట్స్ చేశారు.

రకుల్ మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. బాలీవుడ్, సౌత్ మూవీస్ రెండూ ఒకటే అని.. వాటిని వేర్వేరుగా చూడొద్దని హితవు పలికింది. దేశంలో ప్రతిభగల దర్శకులు ఉన్నారని.. వారు మంచి సినిమాలు చేయడం మనకే గర్వకారణం.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. బాలీవుడ్ సినిమాలను సౌత్‌ చిత్రాలతో పోలుస్తుంటే కోపం వస్తోందా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో దక్షిణాది చిత్రాలతోనే గుర్తింపు వచ్చిన విషయాన్ని మర్చిపోయావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా..గతేడాది కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే రకుల్ నటించింది. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement