తమిళ నటి మృణాళిని రవి(Mirnalini Ravi) లగ్జరీ కారు కొనుగోలు చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న కారును కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఉన్న మృణాళిని రవికి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ తొలి ఛాన్స్ ఇచ్చారు. 2019లో విడుదలైన సూపర్ డీలక్స్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో ఆమె నటించింది. అయితే, ఆమెకు వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలో ఛాన్స్ దక్కడంతో పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా తన మార్కెట్‌ను పెంచుకుంది.

ఫ్రీడమ్ NU పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహించి మహీంద్రా కంపెనీ ఈ కారును విడుదల చేసింది. సరికొత్త టెక్నాలజీతో పాటు లేటెస్ట్ డిజైన్‌లో మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUV లగ్జరీ కారును మృణాళిని రవి కొనుగోలు చేసింది. మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ను ఆగష్టులో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కార్ల అమ్మకం లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చాయి. ఆ కారు మోడల్‌ను దక్కించుకున్న మొదటి వ్యక్తిగా మృణాళిని రికార్డ్ క్రియేట్ చేసింది.
కారు మోడల్ బాగున్నడంతో చాలామంది ధర గురించి వెతుకుతున్నారు. సరికొత్త ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర రూ. 28 లక్షల వరకు ఉంది. బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ BE6 మోడల్ కారును ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు బాలీవుడ్ నటీనటులు కూడా కొనుగోలు చేశారు. అయితే, దక్షిణాది నటీనటుల్లో ఈ కారు సొంతం చేసుకున్న తొలి సినీ నటి మృణాళిని మాత్రమే . ఈ కారు కేవలం 6.7 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలుపుతుంది. నాలుగు డ్రైవింగ్ మోడ్‌ల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిఫాల్ట్, రేంజ్, ఎవ్రీడే, రేస్ అందుబాటులో ఉన్నాయి. అయితే, బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ మాత్రమే లిమిటెడ్ అని కంపెనీ పేర్కొంది.

2019లో కోలీవుడ్ నుంచి సూపర్ డీలక్స్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాళిని రవి.. తెలుగులో గద్దల కొండ సినిమాతో బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ఛాంపియన్, ఎనిమీ, కోబ్రా, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర, రోమియో సినిమాలతో టాలీవుడ్‌కు మరింత దగ్గరైంది. రీసెంట్‌గా విజయ్ ఆంటోనీతో లవ్‌గురు సినిమాతో మెప్పించింది.


