Hansika Marriage: పెళ్లికి సిద్ధమైన హన్సిక... వరుడు అతడేనా?

Is Actress Hansika Motwani Marry a Politician Son Soon - Sakshi

‘దేశముదురు’ మూవీతో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన బ్యూటీ హన్సిక. బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్‌ హీరోలతో జతకట్టి స్టార్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న హాన్సికకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఆమె కోలీవుడ్‌పై ఫోక్‌స్‌ పెట్టింది.

చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు

లేడీ ఓరియంటెడ్‌, గ్లామర్‌ రోల్స్‌ పోషిస్తూ తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. రెండేళ్ల గ్యాప్‌ అనంతరం ఆమె నటించిన తాజా చిత్రం మహా. త్వరలోనే ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించబోతోంది ఆమె. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలను అందుకుంటున్న హాన్సిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. 

చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్‌ రామ్‌

సౌత్‌కు చెందిన ఓ బడా పోలిటీషియన్‌ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని ఫిలిం దూనియాలో వినికిడి. అయితే ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతిత్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని వినికిడి. ఇక దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే హన్సిక స్పందించే వరకు వేచి చూడక తప్పదు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top