'నా భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా అన్నాడు' | Actress Gayathri Suresh recalls past relationship on Bigg Boss Malayalam 8 | Sakshi
Sakshi News home page

Gayathri Suresh: 'నా భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా అన్నాడు'

Oct 6 2026 7:11 PM | Updated on Oct 6 2026 7:30 PM

Actress Gayathri Suresh recalls past relationship on Bigg Boss Malayalam 8

ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో ఆడియన్స్‌ను అలరిస్తోంది. దక్షిణాది భాషల్లో ఈ ఏడాది షో ఒకేసారి ప్రారంభమైంది. అన్ని భాషల్లోనూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. అయితే ఈ రియాలిటీ షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు వివాదాలు కూడా అవుతుంటాయి. అలాంటి సంఘటనలు మనం చాలానే చూశాం. అయితే ఈ షో పాల్గొన్న ఓ మలయాళ బ్యూటీ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 

బిగ్ బాస్ మలయాళం సీజన్ -8లో పాల్గొన్న నటి గాయత్రి సురేశ్ తన జీవితంలో అత్యంత చేదు సంఘటన గుర్తుచేసుకున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షోలో ఒక టాస్క్‌లో రిలేషన్‌షిప్‌ గురించి ‍మాట్లాడారని గాయత్రి తెలిపింది.ఆ అనుభవం తనను తీవ్రంగా గాయపరిచిందని చెప్పింది. అప్పుడు తనకు ఎయిడ్స్ ఉందా అని అడగడం తీవ్రంగా బాధించిదన్నారు. అదే ఏడాది కారు ప్రమాదం తర్వాత తనను ఒంటరిగా వదిలేయడం వంటి విషయాలను ఆమె గుర్తుచేసుకున్నారు.

‘అది  రిలేషన్ అనుకున్నా’

టాస్క్‌లో భాగంగా తనకు అత్యంత బాధ కలిగించిన వ్యక్తితో మళ్లీ మాట్లాడే అవకాశం వస్తే అతనికి ఏమి చెబుతారని బిగ్ బాస్ గాయత్రిని అడిగారు. అప్పుడు గాయత్రి 2021 నాటి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుంది. అప్పట్లో తాను ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని.. మొదట్లో అతనే నా భాగస్వామి అని నమ్మానని తెలిపింది. మా రిలేషన్‌ మొదలైన మొదటి వారంలోనే నీకు ఎయిడ్స్ ఉందా అని అతను నన్ను అడిగాడు. ఆ క్షణమే నేను అతనితో సంబంధం తెంచుకున్నా' అని తెలిపింది.

ఇంకా మాట్లాడుతూ.. “నా జీవితంలో చాలా మంది నన్ను బాధపెట్టారు. కానీ నన్ను అన్నిటికన్నా ఎక్కువగా బాధపెట్టింది.. నన్ను తీవ్రంగా గాయపరిచింది ఇదే. 2021లో నేను ఒక వివాదంలో చిక్కుకున్నప్పుడే జరిగింది. ఆ సమయంలో నేను ఒక సిచుయేషన్‌షిప్‌లో ఉన్నా. నేను దానిని రిలేషన్‌షిప్‌ అనుకున్నా. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. అది కేవలం ఒక సిచుయేషన్‌షిప్ మాత్రమే అనిపిస్తుంది. ఆ తర్వాత అతను వేరొకరితో సంబంధంలో ఉన్నాడని నాకు తెలిసింది” అని ఆమె గుర్తుచేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement