Actor Rana Daggubati Brother Abhiram Wedding Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Abhiram Daggubati Marriage Rumours: టాలీవుడ్ యంగ్ హీరోకి త్వరలో పెళ్లి!

Aug 17 2023 6:13 PM | Updated on Aug 17 2023 6:22 PM

Actor Rana Brother Abhiram Wedding Rumours - Sakshi

టాలీవుడ్‌లో మరో యువ నటుడు పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు రెండో కొడుకు అభిరామ్.. కొన్నాళ్ల ముందు 'అహింస' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో మరో మూవీ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలానే ఇప్పుడు వివాహం కూడా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!)

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెంకటేశ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. సురేశ్ బాబు నిర్మాతగా మారారు. ఇక సురేశ్ పెద్ద కొడుకు రానా.. హీరో కమ్ క్యారెక్టర్ ఆ‍ర్టిస్టుగా ఫేమ్ తెచ్చుకోగా, రెండో కొడుకు అభిరామ్ ఈ మధ్యే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పుడు అతడికే పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటున్నారట. ప్రస్తుతం మాటలు మాత్రమే జరిగాయని త్వరలో నిశ్చితార్థం, పెళ్లి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. 

దగ్గుబాటి రామానాయుడు తమ్ముడి కూతురి కూతురే.. అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని తెలుస్తోంది. అయితే ఈ విషయమై సురేశ్ బాబు ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బహుశా ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండే అవకాశముంది. అదే టైంలో మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి బాజాలు మోగే అవకాశముంది. 

(ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్‌ కామెంట్స్‌ వైరల్‌)

Advertisement
 
Advertisement
Advertisement