నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం | Actor Prakash Raj Mother Suvarnalatha Passed away | Sakshi
Sakshi News home page

Prakash Raj: నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం

Mar 30 2026 10:12 AM | Updated on Mar 30 2026 10:50 AM

Actor Prakash Raj Mother Suvarnalatha Passed away

నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) తుదిశ్వాస విడిచారు.  ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.  కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు.

ప్రకాశ్‌ రాజ్‌ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడకు చెందిన ప్రకాశ్‌ రాజ్‌ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. విలక్షణమైన పాత్రలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్‌ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్‌ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement