హీరో ప్రభాస్‌ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Actor Prabhas Marriage Mother Shyamala Devi Comments Latest | Sakshi
Sakshi News home page

Prabhas Wedding: ఆ పండగలోపే ప్రభాస్‌కి పెళ్లి చేసేస్తాం

Oct 17 2023 6:03 PM | Updated on Oct 17 2023 6:33 PM

Actor Prabhas Marriage Mother Shyamala Devi Comments Latest - Sakshi

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరని అంటే అందరూ ప్రభాస్ పేరే చెప్తారు. గత ఆరేడేళ్ల నుంచి అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే పెళ్లి జరిగింది లేదు. అయితే ఇప్పుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తేదీ ఎప్పుడనేది రివీల్ చేశారు.

ప్రభాస్ పెళ్లి అనగానే చాలామందికి అనుష్కనే గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సే కావచ్చు. కానీ ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా(వేర్వేరుగా) ఉండిపోవడంతో.. ఎప్పటికైనా ఈ జోడీనే పెళ్లి చేసుకుంటుందేమోనని ఫ్యాన్స్‌కి చిన్న ఆశ. మరోవైపు కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్ పెళ్లి చేసేద్దామనుకున్నారు. కానీ షూటింగ్స్‌ బిజీ వల్ల అది జరగలేదు.

(ఇదీ చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?)

తాజాగా దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్మమ్మని దర్శించుకునేందుకు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి వచ్చారు. ఇక విలేకరుల ఆమెని ప్రభాస్ పెళ్లెప్పుడు? అని అడిగారు. దీనికి బదులిచ్చిన ఈమె.. 'కృష్ణంరాజు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ మా ఫ్యామిలీ ముందుకెళ్తోంది. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుంది. అమ్మాయి ఎవరు? డేట్ చెప్పను గానీ త్వరలోనే శుభకార్యం ఉంటుంది. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడు' అని చెప్పారు.

మరి శ్యామలాదేవి చెప్పినట్లు వచ్చే దసరాలోపు పెళ్లి చేసుకుంటాడా అనేది చూడాలి. ఈ డిసెంబరు 22న 'సలార్'తో రాబోతున్న ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ లైనులో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

(ఇదీ చదవండి: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర)

Advertisement
 
Advertisement
Advertisement