సాయిపల్లవికి నాగచైతన్య లవ్‌ ప్రపోజల్‌.. వీడియో చూశారా? | Actor Naga Chaitanya Love Proposal To Sai Pallavi | Sakshi
Sakshi News home page

సాయిపల్లవికి నాగచైతన్య లవ్‌ ప్రపోజల్‌.. వీడియో చూశారా?

Feb 14 2024 1:48 PM | Updated on Feb 14 2024 3:20 PM

Actor Naga Chaitanya Love Proposal To Sai Pallavi - Sakshi

నటుడు నాగచైతన్య వాలెంటైన్స్‌ రోజున ఫ్యాన్స్‌కు సర్​ప్రైజ్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో హీరోయిన్‌ సాయి పల్లవికి లవ్‌ ప్రపోజల్‌ చేస్తున్నట్లు ఉంది. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వీరిద్దరూ ‘తండేల్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిదే.

బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం స్పెషల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అందులో ఓ డైలాగ్​ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ డైలాగ్‌తో ఇన్‌స్టాలో లెక్కలేనన్ని రీల్స్‌ వచ్చాయి.

ఇప్పుడు నాగచైతన్య కూడా సాయి పల్లవితో ఒక రీల్‌ చేశాడు. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే అంటూ వాలెంటైన్స్‌ డే విషెష్‌ చెప్పాడు. తండేల్‌ గ్లింప్స్‌ పట్ల వస్తున్న రెస్పాన్స్‌ తనకు చాలా థ్రిల్లింగ్‌ ఉన్నట్లు నాగచైతన్య చెప్పాడు. దానిపై నెటిజన్లు రీల్స్‌ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. దీంతో అందరిలా తాము కూడా ఒక రీల్‌ చేయాలని నిర్ణయించుకొని వాలెంటైన్స్‌ డే రోజున అందిస్తున్నట్లు ఆయన తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement