గంజాయి మాఫీయాపై బ్ర‌హ్మ‌స్త్రం 'అభినవ్' | Abhinav Movie Trailer out Now | Sakshi
Sakshi News home page

గంజాయి మాఫీయాపై బ్ర‌హ్మ‌స్త్రం 'అభినవ్'

Aug 15 2024 7:43 PM | Updated on Aug 15 2024 7:43 PM

Abhinav Movie Trailer out Now

శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాల‌ల చిత్రం 'అభినవ్'. ఈ చిత్రాన్ని భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ నిర్మాత, ద‌ర్శ‌కునిగా తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో  ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేశారు.

గ్రామీణ ప్రాంతాల‌లోని హ‌రిజ‌న‌, గిరిజ‌న విద్యార్థుల‌ను స‌త్య అనే గంజాయి మాఫియాడాన్ విద్యార్థుల‌తో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. బంటి అనే గిరిజ‌న బాలుడు స్మ‌గ్ల‌ర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. భార‌తి అనే అభ్యుద‌య ఉపాధ్యాయురాలి ద్వారా ప్రేరణ పొందిన అభినవ్, రోహ‌న్‌, అక్ష‌ర, ఇత‌ర బాల బాలిక‌లు ఎన్‌సీసీ,  ఆర్మీ శిక్ష‌ణ పొందుతుంటారు. ఎన్ఎస్ ఎస్ ప్రొగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాల‌కు వెళ్ళిన గిరిజ‌న విద్యార్థుల స్థితిగ‌తుల‌ను గ‌మ‌నించి డ్ర‌గ్ మాఫియాను అంతం చేయ‌డానికి ఆర్మీ త‌ర‌హా శిక్ష‌ణ తీసుకుంటారు. 

ఈ చిత్రం ప్ర‌ధాన ఉద్దేశం బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించ‌డం. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో స‌మ్మెట గాంధీ,  మాఫియా డాన్‌గా స‌త్య ఎర్ర‌,  ప్ర‌ధాన బాల న‌టులు మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర నటించారు. కెమెరామెన్‌ సామ‌ల భాస్క‌ర్‌, సంగీతం వందే మాత‌రం శ్రీ‌నివాస్‌, ఎడిట‌ర్  నంద‌మూరి హ‌రి, ఈ చిత్రాన్ని సార‌థి స్టూడియో  స‌హ‌కారంతో పూర్తి చేయ‌డం జ‌రిగిందని నిర్మాత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement