శంబాల: న్యూఇయర్‌ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ | Aadi Saikumar Starrer Shambhala Movie Poster Released FOR 2025 | Sakshi
Sakshi News home page

Aadi Saikumar: కొత్త సంవత్సరం కానుకగా 'శంబాల' పోస్టర్‌ రిలీజ్‌

Jan 1 2025 4:56 PM | Updated on Jan 1 2025 6:27 PM

Aadi Saikumar Starrer Shambhala Movie Poster Released FOR 2025

టాలీవుడ్‌ హీరో ఆది సాయి కుమార్ (Aadi Saikumar) శంబాల అంటూ కొత్త ప్రపంచంలోకి ఆడియెన్స్‌‌ను తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌ (Shambhala: Mystical World) అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు.

ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆది సాయి కుమార్ వింటేజ్ మేకోవర్ అదిరిపోయింది. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన కొత్త పోస్టర్ శంబాల మీద మరింతగా ఆసక్తి పెంచేలా ఉంది. ఈ పోస్టర్‌లో చూపించిన పొలం.. దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం ఇలా అన్నీ కూడా కథ మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి.

ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో లబ్బర్ పందు ఫేమ్ స్వాసిక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో తళుక్కుమని మెరవనున్నారు. హన్స్ జిమ్మర్ వంటి హాలీవుడ్ వ్యక్తులతో కలిసి పనిచేసిన ప్రతిభావంతులైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శంబాల శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

చదవండి: క్యాన్సర్‌ నుంచి కోలుకున్నా.. త్వరలోనే మీ ముందుకు వస్తా: శివరాజ్

Advertisement
 
Advertisement
Advertisement