మేలో ఆ ఒక్కటీ అడక్కు  | Aa Okkati Adakku Release Date Announcement | Sakshi
Sakshi News home page

మేలో ఆ ఒక్కటీ అడక్కు 

Apr 16 2024 12:09 AM | Updated on Apr 16 2024 12:11 AM

Aa Okkati Adakku Release Date Announcement - Sakshi

ఫరియా అబ్దుల్లా, ‘అల్లరి’ నరేశ్‌

మండే వేసవిలో థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించేందుకు ‘అల్లరి’ నరేశ్‌ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌. రాజీవ్‌ చిలక నిర్మించారు. భరత్‌ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్‌ రిలీజ్‌ హక్కులను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఎల్‌ఎల్‌పీ పొందింది. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చాలా కాలంగా నన్ను పూర్తిగా ఫన్‌ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. అది ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌.

Advertisement
 
Advertisement
Advertisement