చాణక్య మాస్టారు | 35 Chinna Katha kaadu: Priyadarshi Upcoming Film | Sakshi
Sakshi News home page

చాణక్య మాస్టారు

Aug 2 2024 12:17 AM | Updated on Aug 2 2024 12:17 AM

35 Chinna Katha kaadu: Priyadarshi Upcoming Film

పిల్లలకు లెక్కలు చెప్పడానికి నీట్‌గా రెడీ అయి స్కూల్‌కి వెళ్లారు లెక్కల మాస్టారు చాణక్య వర్మ. ఒక విద్యార్థి హాయిగా నిద్రపోతుంటే గుర్రున చూశారు మాస్టారు. మరో ఇద్దరు బాలురు నేచురల్‌ కాల్‌ అంటూ చిటికెన వేలు చూపిస్తారు. ఇలా చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఈ విద్యార్థుల లెక్కలు ఎలా తేల్చాలా అన్నట్లు ముఖం పెడతారు మాస్టారు.

చాణక్య వర్మగా ప్రియదర్శి నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. గురువారం విడుదల చేసిన ఈ పాత్ర తాలూకు వీడియో గ్లింప్స్‌లో పైన చెప్పిన దృశ్యాలు కనిపించాయి. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్‌ గౌతమి, భాగ్యరాజ్‌ లీడ్‌ రోల్స్‌లో రూపొందిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్‌ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement