గౌతమ్‌, నబీల్‌ ఫైట్‌లో.. గెలిచింది ఎవరు..? | Bigg Boss Telugu 8 Nov 5th Episode Full Review | Sakshi
Sakshi News home page

గౌతమ్‌, నబీల్‌ ఫైట్‌లో.. గెలిచింది ఎవరు..?

Nov 6 2024 7:29 AM | Updated on Nov 6 2024 9:03 AM

Bigg Boss Telugu 8 Nov 5th Episode Full Review

బిగ్‌బాస్ ప‌దోవారం కొనసాగుతుంది. ఆటలో స్పీడ్‌ పెరిగింది. ఈ వారం నామినేష‌న్స్‌లో ప్రేర‌ణ‌, విష్ణుప్రియ‌, హ‌రితేజ‌, గౌత‌మ్‌, నిఖిల్‌, య‌ష్మి,పృథ్వీ  ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌ ఎవరు కానున్నారో అనే విషయంలో ఆసక్తి రేగింది. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ పెట్టే టాస్క్‌లలో వారందరూ కూడా బలంగా ఆడాలని నిర్ణయించుకున్నారు. ఇంతకు (నవంబర్‌ 5) బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

నిఖిల్‌, యష్మిల మధ్య 'అక్క' టాపిక్‌.. గౌతమ్‌ అలా ఎందుకు పిలుస్తున్నాడు..?
మంగళవారం జరిగిన ఎపిసోడ్‌ ప్రారంభంలోనే యష్మికి నిఖిల్‌ క్లాస్‌ పీకుతాడు. సోమవారం జరిగిన నామినేషన్‌లో అక్క అనే పాయింట్‌ను పెద్దది చేశావ్‌ అంటూ చెప్తాడు. నామినేషన్‌ అంతా కూడా ఆ పదం చుట్టే తిరిగిందని చెప్తాడు. గౌతమ్‌తో పదే పదే అక్క అనే టాపిక్‌ లేకుండా చూసుకోవాలని నిఖిల్‌ సలహా ఇస్తాడు. అయితే, యష్మిని గౌతమ్‌ అక్క అని పిలివడానికి కారణం ఉంది. దానిని టెలికాస్ట్‌ చేయలేదు. గౌతమ్‌తో పృథ్వీ మాట్లాడుతూ.. నిఖిల్‌, యష్మి ఇద్దరూ క్లోజ్‌గా ఉన్నారనే సిగ్నల్‌ పాస్‌ చేస్తాడు. దీంతో గౌతమ్ రిలైజ్‌ అవుతాడు. ఆ విషయం తనకు తెలియదని గౌతమ్‌ చెప్తాడు. దీంతో యష్మిని అక్క అని పిలవడం ప్రారంభించాడు.

అవినాష్‌,టేస్టీ తేజ,రోహిణిలను టార్గెట్‌ చేసిన హరితేజ
ఈ వారం అవినాష్‌ మెగా చీఫ్‌గా ఉండటంతో సోమవారం జరిగిన నామినేషన్స్‌లో అతనికి బిగ్‌బాస్‌ ఒక పవర్‌ ఇస్తాడు. నామినేషన్‌ లిస్ట్‌లో ఉన్న వారిలో ఎవరినైనా ఒకరిని సేవ్‌ చేయవచ్చని ఆఫర్‌ ఇస్తాడు. దీంతో రోహిణిని సేవ్‌ చేస్తున్నానని అవినాష్‌ చెప్తాడు. అయితే, దీనిని హరితేజ తప్పు పడుతుంది. అవినాష్‌,టేస్టీ తేజ,రోహిణిలకు నామినేషన్‌ అంటే హడలెత్తిపోతున్నారని కామెంట్‌ చేస్తుంది. వారి ముగ్గురిలో ఎవరు నామినేషన్‌లోకి వచ్చినా తప్పకుండా ఒకరు ఎలిమినేట్‌ అవుతారని చెబుతుంది.  అందుకే రోహిణిని సేవ్‌ చేశాడని హరితేజ చెప్తుంది. నిఖిల్‌ను అవినాష్‌ ఎలిమినేషన్‌లోకి తీసుకురావడాన్ని కూడా హరితేజ తప్పు పడుతుంది. నిఖిల్‌ ఒక ఎడ్డోడు.. ప్రతిసారి అవినాష్‌ను నమ్ముతాడని హరితేజ చెబుతుంది.

నబీల్‌ను భయపెట్టిన గౌతమ్‌.. ఓడి గెలిచాడు
ఈ వారం ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చాడు గౌతమ్‌. సీజన్‌ 7లో తన ఆటతో ఎలా మెప్పించాడో మనం చూశాం. ఇప్పుడు అలాంటి గౌతమ్‌ మళ్లీ కనిపిస్తున్నాడు.  ప్రస్తుతం కన్నడ బ్యాచ్‌కు చుక్కులు చూపుతున్న గౌతమ్‌.. మంగళవారం జరిగిన ఒక టాస్క్‌లో నబీల్‌ను భయపెట్టాడు. నబీల్‌, గౌతమ్‌ మధ్య జరిగిన బిగ్‌ఫైట్‌లో కన్నడ బ్యాచ్‌తో సహా  అందరూ నబీల్‌కే సపోర్ట్ చేసినా సరైన ఆటతో గౌతమ్‌  విజృంభించాడు.

నబీల్-గౌతమ్‌కి 'షేప్ యుఆర్ ఫ్యూచర్' అనే ఛాలెంజ్‌ను బిగ్‌బాస్‌ ఇస్తాడు. ఇందులో  ఇరువురు కంటెస్టెంట్లు తమ ముందున్న బోర్డ్‌పై ఆయా షేపుల్లో ఉన్న వస్తువులను తగిలించాలి. ఇద్దరూ పులి, సింహం అనేలా ఆడుతారు. ఈ క్రమంలో వారు ఫిజికల్‌ అయిపోతారు. ఈ సమయంలో కన్నడ బ్యాచ్‌తో పాటు అందరూ నబీల్‌కు సపోర్ట్‌ చేస్తారు. ఏ ఒక్కరు కూడా గౌతమ్‌ కోసం సపోర్ట్‌ చేయరు.  ఆ సమయంలో నా కోసం ఎవరో ఒక్కరు సపోర్ట్‌ చేయండి అని గౌతమ్‌ వేడుకుంటాడు. అప్పటికే గంగవ్వ కూడా ఇదే  విషయాన్ని చెబుతుంది. అందరూ నబీల్‌కే సపోర్ట్‌ చేస్తున్నారు. కాస్త గౌతమ్‌కు కూడా సపోర్ట్‌ చేయండి అంటూ చెబుతుంది. అప్పటి నుంచి రోహిణి, అవినాష్‌లు గౌతమ్‌ను ఎంకరేజ్‌ చేస్తారు. ఏదేమైనా ఫైనల్‌గా నబీల్‌ గెలుస్తాడు. అయితే, గౌతమ్‌ చేసిన పోరాటానికి ఆడియన్స్‌ ఫిదా అవుతారు. అందుకే గౌతమ్‌ ఓడినా గెలిచాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

యష్మికి గిఫ్ట్‌ ఇచ్చిన నబీల్‌
నబీల్‌, గౌతమ్‌ల మధ్య జరిగిన పోరాటంలో నబీల్‌ గెలవడంతో తనకు లభించిన బ్రీఫ్‌ కేసును ఓపెన్‌ చేస్తాడు. అందులో రూ. 1.20 లక్షలు ప్రైజ్‌ మనీ ఉండటంతో సంతోషిస్తాడు. ఈ ఆటలో గెలిచిన నబీల్‌ చీఫ్‌ కంటెండర్‌ అయ్యాడని బిగ్‌బాస్‌ ప్రకటిస్తాడు. అయితే, తన వద్ద ఉన్న ఆరెంజ్‌బ్రీఫ్‌కేస్‌ను యష్మీకి నబీల్‌ ఇస్తాడు. అంటే ఆమె కూడా చీఫ్‌ కెంటెండర్‌ అయ్యేందుకు పోటీ  పడుతుంది. అలా యష్మీకి నబీల్‌ గిఫ్ట్‌ ఇస్తాడు. అప్పటికే ఒక మ్యాచ్‌లో గెలుపొందిన రోహిణి రేసులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement