వైఐఎస్‌ వద్ద మైనింగ్‌కు అనుమతించొద్దు | - | Sakshi
Sakshi News home page

వైఐఎస్‌ వద్ద మైనింగ్‌కు అనుమతించొద్దు

Nov 18 2026 11:01 AM | Updated on Nov 18 2026 11:01 AM

బీజేపీ నాయకులు

రామాయంపేట(మెదక్‌): నూతనంగా నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా స్కూల్‌, డబుల్‌ బెడ్‌ రూం కాలనీ సమీపంలో మైనింగ్‌కు అనుమతించవద్దని బీజేపీ నాయకులు హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాగి రాములు, మండలశాఖ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, పట్టణాధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మైనింగ్‌తో ఇళ్లతోపాటు, యంగ్‌ ఇండియా స్కూల్‌ భవన సముదాయానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి సమీపంలోనే 1,421 సర్వే నంబర్‌లో మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతిస్తూ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం తగదని వారు పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు అనుమతులు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు వారు తహసీల్దార్‌ రజనీకి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement