సెలవుపెట్టి.. ఐక్యత చాటి | - | Sakshi
Sakshi News home page

సెలవుపెట్టి.. ఐక్యత చాటి

Nov 18 2026 11:01 AM | Updated on Nov 18 2026 11:01 AM

సెలవుపెట్టి.. ఐక్యత చాటి

కలెక్టరేట్‌ వద్ద సీపీఎస్‌ ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష

మెదక్‌ కలెక్టరేట్‌: ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ అమలు చేయాలని పింఛన్‌ పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఎస్‌ ఉద్యోగులంతా మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద సీపీఎస్‌ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అత్యధిక శాతం మంది సీపీఎస్‌ ఉద్యోగులు సామూహిక సెలవు ప్రకటించి, సత్యాగ్రహ దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొని తమ ఐక్యతను, ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ..ఓపీఎస్‌ ఉద్యోగులతో పోలిస్తే సీపీఎస్‌ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రం, చరణ్‌ సింగ్‌, మహేందర్‌గౌడ్‌, జంగం నగేశ్‌కుమార్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement