బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లపై వివక్ష | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లపై వివక్ష

Nov 18 2026 11:01 AM | Updated on Nov 18 2026 11:01 AM

నర్సాపూర్‌/కౌడిపల్లి(నర్సాపూర్‌): బీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచుల పట్ల మండలంలోని పలువురు అధికారులు వివక్ష చూపుతున్నారని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, బీఆర్‌ఎస్‌ నాయకుడు మధుకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు సర్పంచులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలను తీసుకురావడానికి తమ సహాయాన్ని వాడుకుంటున్న ఆయా శాఖల అధికారులు వేదికలపైకి కాంగ్రెస్‌కు చెందిన సర్పంచులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో సైతం తమ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలుతోపాటు గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని వారిని అధికారులు విస్మరించరాదని, సర్పంచులందరిని సమాన దృష్టితో చూడాలని కోరారు. తమ పట్ల వివక్ష చూపే అధికారులు తమ తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచులు, నాయకులు కొండల్‌రెడ్డి, గేమ్యానాయక్‌, సుధాకర్‌, పోచయ్య, రాంలు నాయక్‌, కరుణాకర్‌, అశోక్‌గౌడ్‌ తదితరులున్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: కృష్ణాగౌడ్‌

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు, కౌడిపల్లి సర్పంచ్‌ చంద్రం కృష్ణాగౌడ్‌ తెలిపారు. కౌడిపల్లిలో లబ్ధిదారులకు చేయూత పింఛనన్‌ మంజూరు పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరుగ్యారంటీలు అమలు చేస్తు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పుండరీకంగౌడ్‌, ప్రశాంత్‌, సందీప్‌, మల్లికార్జున్‌గౌడ్‌, సంగప్ప, దేవేందర్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement