నర్సాపూర్: బీఆర్‌ఎస్ హయామంతా అవినీతిమయమేనని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో ప్రజలు ఆశించిన లక్ష్యాలను అందించాలన్న లక్ష్యంతో తమ కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారంటీల హామీ ఇచ్చిందని అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆ హామీలను అమలు చేస్తున్నందున ప్రజలు తమను ఆదరిస్తున్నారని వారు తెలిపారు. ప్రజలలో తమకు లభిస్తున్న ఆదరణను చూసి మాజీమంత్రి హరీశ్‌రావు తట్టుకోలేక నిత్యం సీఎం, మంత్రులపై అబద్ధాలతో కూడిన విమర్శలు చేస్తున్నారని వారు ఆయన విమర్శలను ఖండించారు. ఈ నెల 19న సిద్దిపేటలో జరగనున్న సీఎం బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు రిజ్వాన్, మల్లేశ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు పీఏసీఎస్‌లు మంజూరు
నియోజకవర్గానికి కొత్తగా నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)లు మంజూరయ్యాయని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం గోమారం, కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామాల్లో పీఏసీఎస్‌లను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. నాలుగు సహకార సంఘాలు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులకు ఆవుల రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్,
నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి


