‘మెరుగైన జీవితం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ దైనందిన జీవిత సమస్యలను పరిష్కరించడంలో ఏఐ సాంకేతికత పాత్ర
గ్రీన్ ఎనర్జీ– పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణ–పర్యావరణ రక్షణ మార్గాలు
మ్యాథమెటికల్ మోడలింగ్– కంప్యూటేషనల్ థింకింగ్ గణిత నమూనాలు
ఆరోగ్యం, పరిశుభ్రత – పారిశుధ్యం,
ప్రజారోగ్యం
దేశీయ వ్యవసాయ పద్ధతులు మన సాంప్రదాయ, సేంద్రియ– సుస్థిర వ్యవసాయ విధానాల విశిష్టత
గ్రామీణ పరివర్తన కోసం సైన్స్
విపత్తు నిర్వహణ ప్రకృతి వైపరీత్యాలనుముందస్తుగా గుర్తించడం, ఎదుర్కొనే ప్రణాళికలు– రక్షణ చర్యలు.
● వచ్చే నెల మొదటి వారంలో ప్రదర్శనలు ● పీఎంశ్రీ పాఠశాలలకు ప్రత్యేక గ్యాలరీ
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, పరిశోధనా నైపుణ్యాలను అభివృద్ధి పర్చేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. జిల్లా కేంద్రంలోని వెస్లీ స్కూల్ వేదికగా డిసెంబర్ మొదటి వారంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ‘సుస్థిర– వికసిత్ భారత్ కోసం సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‘ అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 290 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 55 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఈసారి నుంచి పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది జిల్లాలో ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికై న మొత్తం 49 ప్రాజెక్టులను కూడా ఈ జిల్లాస్థాయి ప్రదర్శనలో తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠ శాలల నుంచి 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనాలని డీఈఓ రాజు ఆదేశాలు జారీ చేశారు. సందేహాలకు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డిని (8328599157) సంప్రదించాలని సూచించారు.
ప్రాజెక్ట్‌ల అంశాలు


