బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
హవేళిఘణాపూర్(మెదక్): తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మిట్ ఏర్పాటు చేసిందని, ముందు రాహుల్‌గాంధీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై స్పష్టతనివ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి రైతులు నానా అవస్థలు పడుతుంటే, ప్రభు త్వం మాత్రం భారత్ సమ్మిట్ పేరుతో ప్రజాధనం వృథా చేస్తుందన్నారు. బీజేపీ నాయకులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరిత, స్వామి, పోచయ్య, భానుప్రసాద్, వేణు, బాబు, కిష్టయ్య, వరప్రసాద్, రంజిత్ పాల్గొన్నారు.


