మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

ఆయుష్‌ డైరెక్టర్‌ అయేషా మస్రత్‌ ఖానం

ఆయుష్‌ డైరెక్టర్‌ అయేషా మస్రత్‌ ఖానం

తూప్రాన్‌: పట్టణంలోని ప్రభు త్వ ఆయుర్వేద ఆస్పత్రిని ఆ యుష్‌ విభాగ రాష్ట్ర డైరెక్టర్‌ అయేషా మస్రత్‌ ఖానం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆస్పత్రిలోని వివిధ విభాగా లను పరిశీలించిన ఆమె, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలో రికార్డులు, వైద్యు లు, సిబ్బంది హాజరుశాతం,మందుల నిల్వ ల వివరాలను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులు తమ సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నిర్వహణకు సరిపడా నిధులు అందుబాటులో లేకపోవడం వల్లే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించలేకపోతున్నామని వారు వివరించారు. దీనిపై కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రి అవసరాలను, నిధుల కొరతను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్‌కుమార్‌, ప్రభాకర్‌రావు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement