కార్తీక్‌ను సన్మానిస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
కౌడిపల్లి(నర్సాపూర్): క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజేపీ జిల్లా కన్వీనర్ హరిబాబు తెలిపారు. తునికి గురుకులంలో గత విద్యా సంవత్సరం ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థి అడెపు కార్తీక్ అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఎంపిక కావడంతో శుక్రవారం గురుకులంలో సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థి స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా, ఇండియన్ రెస్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చండీగఢ్‌లో జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలలో గెలుపొందడంతో అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు చెప్పారు. ప్రస్తుతం కార్తీక్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని చెప్పారు. కార్యక్రమంలో ఏటీపీ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎంజేపీ జిల్లా కన్వీనర్ హరిబాబు


